అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో.. రైతుల ఆరు రోజుల ప్రణాళిక

amaravati jac 6 days plan ready
  • రేపు గుంటూరులో మహా పాదయాత్ర 
  • 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనం
  • 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్ర
  • 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ
అమరావతి రాజధాని రైతులు కొనసాగిస్తోన్న ఉద్యమం ఈ నెల 17తో ఏడాది పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. రేపటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది.

తొలి రోజయిన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్రను చేస్తారు. చివరిరోజయిన ఈ నెల 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13, 16న కూడా నిరసనలు తెలుపుతారు. తమ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదని, అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని ఐకాస నేతలు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Amaravati
Andhra Pradesh

More Telugu News