మహేశ్ బాబు సినిమాకి 'రౌడీ' టైటిల్?
- 'సర్కారు వారి పాట'లో నటిస్తున్న మహేశ్
- తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా
- మాస్ రౌడీ పాత్రలో కనిపించనున్న మహేశ్
- 'స్టేట్ రౌడీ' టైటిల్ని పరిశీలిస్తున్న దర్శకుడు
'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తాజాగా 'సర్కారు వారి పాట' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మహేశ్ ఓకే చెప్పాడు. ఇందులో మహేశ్ పక్కా మాస్ రౌడీ క్యారెక్టర్లో కనిపిస్తాడట. దీంతో ఈ చిత్రానికి 'స్టేట్ రౌడీ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.
ఇదిలావుంచితే, బ్యాంకు స్కామ్ ల నేపథ్యంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రం రెగ్యులర్ షూటింగును వచ్చే నెల నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంక్ సెట్ ను కూడా వేస్తున్నారు. ఆ షెడ్యూల్ తర్వాత యూనిట్ మరో షెడ్యూల్ కోసం అమెరికా వెళుతుంది.