KCR: డెంటిస్టును కలిసేందుకు నేడు ఢిల్లీకి కేసీఆర్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ!

Telangana cm kcr today visits new delhi
  • రెండు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్!
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఒత్తిడి
  • అంతర్రాష్ట్ర నీటి వివాదాలను తేల్చాలని కోరనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిల విడుదలపై ఆర్థిక మంత్రితో చర్చించే అవకాశం ఉంది. అలాగే, కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరనున్నారు.

అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ -3 ప్రకారం రాష్ట్రం చేసిన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని, లేదంటే ట్రైబ్యునల్‌కు సిఫార్సు చేయాలన్న తమ అభ్యర్థనకు ఇప్పటి వరకు సమాధానం లేకపోవడంతో ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని నీటిపారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే, పంటి సమస్యతో బాధపడుతున్న కేసీఆర్‌ అక్కడ డెంటిస్టును కలుస్తారని, రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉంటారని సమాచారం.
KCR
Telangana
New Delhi
Dentist

More Telugu News