Nara Lokesh: వారివల్లే రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది: లోకేశ్

Lokesh comments about TDP and NTR
  • టీడీపీ, ఎన్టీఆర్, చంద్రబాబు రైతుల కోసం ఎంతో చేశారన్న లోకేశ్
  • టీడీపీ తెలుగురైతు పార్లమెంటరీ విభాగానికి అధ్యక్ష, కార్యదర్శులు
  • పనిచేసే వారికే పదవులన్న లోకేశ్
  • పనిచేయకపోతే మూడు నెలల్లో మార్పు తప్పదని హెచ్చరిక
  • పార్టీకి, రైతులకు మధ్య అనుసంధానంగా ఉండాలని స్పష్టీకరణ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలకు మరింత చేరువయ్యే క్రమంలో టీడీపీ అనుబంధ సంఘాల బలోపేతంపై దృష్టి సారించారు. తెలుగురైతు పార్లమెంటరీ విభాగం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతనంగా నియమితులైన తెలుగురైతు పార్లమెంటు అధ్యక్ష, కార్యదర్శులతో లోకేశ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనిచేసే వారికే పదవులు అని స్పష్టం చేశారు. పదవులను అలంకారంగా భావిస్తే మూడు నెలల్లో మార్పు తప్పదని హెచ్చరించారు. పార్టీకి, రైతులకు మధ్య తెలుగురైతు విభాగం అనుసంధానంగా ఉండాలని స్పష్టం చేశారు. టీడీపీ, ఎన్టీఆర్, చంద్రబాబుతోనే రైతులకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. రైతుల కోసం వారు ఎంతో కృషి చేశారని తెలిపారు.
Nara Lokesh
Telugudesam
Chandrababu
Farmers
Andhra Pradesh

More Telugu News