nagababu: తన భార్య ఫొటో పోస్ట్ చేసి.. కూతురి పెళ్లిపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Nagababu saya daughters wedding is a mammoth Herculean task for any father
  • కూతురి పెళ్లి అంటే ఏ తండ్రికి అయినా చాలా క్లిష్టతరమైన పని
  • తన కూతురి పెళ్లిని అన్ని విధాలుగా చాలా గొప్పగా జరపాలని కల కంటాడు
  • నేనూ అటువంటి తండ్రినే
  • నా భార్య పద్మ అన్ని విధాలుగా సాయపడింది
నాగబాబు కూతురు నిహారిక వివాహం నిన్న రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నిహారిక-చైతన్యల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో తన భార్య పద్మతో తీసుకున్న ఫొటోను నాగబాబు పోస్ట్ చేస్తూ ఆమె గురించి పలు విషయాలు చెప్పారు.

‘కూతురి పెళ్లి అంటే ఏ తండ్రికి అయినా చాలా క్లిష్టతరమైన పని. తన కూతురి పెళ్లిని అన్ని విధాలుగా చాలా గొప్పగా జరపాలని ప్రతి తండ్రి కల కంటాడు. నేనూ అటువంటి తండ్రినే. ఈ పనిని నేను చాలా సులభంగా పూర్తి చేసేందుకు నా భార్య పద్మ అన్ని విధాలుగా సాయపడింది’ అని నాగబాబు ట్వీట్ చేశారు.

కాగా, కొన్ని రోజులుగా నాగబాబు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైపోయిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేసింది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ హోటల్ లో మెగా కుటుంబం ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంది.
nagababu
Niharika Konidela
marriage

More Telugu News