Telangana: వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హుల నమోదుకు... తెలంగాణ 'కొవిడ్' యాప్!

Telangana Special App for Covid Vaccine Distribution
  • తొలి విడతలో దాదాపు 75 లక్షల మందికి టీకా
  • పది రోజుల్లో సిద్ధం కానున్న వ్యాక్సిన్
  • యాప్ ద్వారా పేర్ల నమోదు
తొలి దశలో కరోనా వ్యాక్సిన్ ను తీసుకునేందుకు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేయించుకునేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఓ స్పెషల్ యాప్ ను సిద్ధం చేస్తోంది. మరో వారం, పది రోజుల్లో దీన్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని, కొవిడ్ యాప్ పేరిట ఇది తయారవుతోందని అధికారులు వెల్లడించారు. జనవరి రెండో వారం నుంచి వ్యాక్సిన్ ను పంచేందుకు ఏర్పాట్లు జరుగుతుండటంతో, ఫ్రంట్ లైన్ యోధులైన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు ఏఎన్ఎంలు, ఆసరా కార్యకర్తల జాబితాలో 3 లక్షల మందిని గుర్తించామని పేర్కొన్న అధికారులు, మునిసిపల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టుల సమాచారాన్ని సైతం సేకరిస్తున్నారు.

వీరితో పాటు 50 ఏళ్లకు పైబడిన వయో వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మొదటి విడతలోనే 70 నుంచి 75 లక్షల మందికి టీకాలు వేయాలని నిర్ణయించామని, దాదాపు 3 కోట్ల డోస్ లను నిల్వ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ సిద్ధంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇక వ్యాక్సిన్ పై ఎంపిక చేసిన వైద్య సిబ్బందికి ప్రత్యేక ట్రయినింగ్ క్యాంప్ కూడా మొదలైంది. నిన్న వర్చ్యువల్ విధానంలో ప్రారంభమైన శిక్షణ, నేడు కూడా కొనసాగనుంది.

Telangana
Corona Virus
Vaccine
App
Covid

More Telugu News