Bigg Boss Telugu 4: టాలీవుడ్ 'బిగ్ బాస్- 4' విజేత ఎవరవుతారో చెప్పిన హీరో శ్రీకాంత్!

Actor Srikant Guess on Biggboss 4 Winner
  • అభిజిత్ గెలుస్తాడని భావిస్తున్న శ్రీకాంత్
  • ఇప్పటికే అభిజిత్ కు జబర్దస్త్ ఆర్టిస్టుల మద్దతు
  • మూడవ సీజన్ లో గెస్ట్ గా వచ్చిన శ్రీకాంత్
దాదాపు మూడు నెలలుగా తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ మరో రెండు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉండగా, ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆపై మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారన్న సంగతి తెలిసిందే. ఇక, ఈ సంవత్సరం అభిజిత్ గెలుస్తాడని తాను అభిప్రాయపడుతున్నట్టు నటుడు శ్రీకాంత్ అంచనా వేశారు.

అభిజిత్ హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని, అతనితో పాటు అరియానా, సోహైల్, హారిక, అఖిల్ టాప్-5లో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అంటే, శ్రీకాంత్ లెక్కలో ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు హౌస్ లో ఉన్న పరిస్థితి ప్రకారం అభిజిత్ గెలుస్తాడని అనుకుంటున్నానని శ్రీకాంత్ తెలిపారు.

కాగా, ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు సైతం అభిజిత్ కు మద్దతుగా నిలువగా, పలువురు జబర్దస్త్ కళాకారులు సైతం అతనికే ఓటు వేస్తున్నట్టు తెలిపిన సంగతి విదితమే. వాస్తవానికి శ్రీకాంత్ కు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ ఆయన ఈ షోను క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటారు. మూడవ సీజన్ గ్రాండ్ ఫినాలేకు శ్రీకాంత్ గెస్ట్ గానూ వెళ్లారు. నాలుగో సీజన్ నూ ఫాలో అవుతున్న ఆయన, తాజాగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
Bigg Boss Telugu 4
Srikant
Winner
Abhijit

More Telugu News