Telangana: తెలంగాణలో జనవరి రెండో వారం నుంచే కరోనా టీకాలు: వైద్య ఆరోగ్యశాఖ

Vaccine From January Second Week Says Telangana Health Ministry
  • 80 లక్షల మందిని ఇప్పటికే గుర్తించాం
  • 1.60 కోట్ల డోస్ లను సిద్ధం చేస్తున్నాం
  • టీఎస్ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
కరోనా నియంత్రణ టీకాలు వేయటానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. ముందుగా నాలుగు విభాగాలకు చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేయాలని నిర్ణయం తీసుకుంది. వైద్య సిబ్బంది, పోలీస్, పారిశుద్ధ్య కార్మికుల్లో 80 లక్షల మందిని ఇప్పటికే గుర్తించామని ఆ శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక కోటి 60 లక్షల టీకాలు సిద్ధం చేసే  పనిలో ప్రస్తుతం నిమగ్నమయ్యామని తెలిపారు.

జనవరి రెండో వారం‌ నుంచి టీకాలు  వేయటం ప్రారంభిస్తామని స్పష్టం చేసిన ఆయన, ఒక్కొక్కరికి రెండు డోసుల్లో టీకాలు వేయాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. కరోనా నియంత్రణ టీకా 9 నుంచి 12 నెలల కాలం పనిచేస్తోందని తెలియజేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉచితంగా టీకాల పంపిణీ జరుగుతుందని, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Telangana
Corona Virus
Vaccine
Health Ministry

More Telugu News