Bhadra Reddy: శ్యామలాదేవి ఎవరో నాకు తెలియదు: మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి

Minister Malla Reddy sons response on land grabbing allegations
  • మల్లారెడ్డిపై కబ్జా కేసు పెట్టిన మహిళ
  • ఆమె ఆరోపణల్లో నిజం లేదన్న భద్రారెడ్డి
  • తమను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని వ్యాఖ్య
ఒక మహిళకు చెందిన భూమిని కబ్జా చేశారనే ఆరోపణలతో తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కుత్బుల్లాపూర్ మండలం సూరారంకు చెందిన శ్యామలాదేవి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మల్లరెడ్డిపై కబ్జా కేసు నమోదు కావడం రాజకీయ చర్చకు దారితీసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి స్పందించారు.

తమపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్న శ్యామలాదేవి ఎవరో కూడా తమకు తెలియదని భద్రారెడ్డి అన్నారు. తమ డెంటల్ కాలేజీ పక్కన రెండు ఎకరాల భూమి ఉందని... అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆమె దగ్గర భూమికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నా పోలీసులకు లేదా కోర్టుకు ఇవ్వొచ్చని అన్నారు. ఆమెను తాము బెదిరిస్తున్నామనే ఆరోపణల్లో నిజం లేదని... అధికారులపై తాము ఒత్తిడి తీసుకొస్తున్నామనేది కూడా నిజం కాదని చెప్పారు.

శ్యామలాదేవి చెపుతున్న భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉందని... అనవసరంగా తమను వివాదంలోకి లాగుతున్నారని భద్రారెడ్డి అన్నారు. ఆమె తమపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో కూడా తమకు అర్థం కావడం లేదని చెప్పారు.
Bhadra Reddy
Malla Reddy
TRS
Land Grab

More Telugu News