Jagan: అనంతపురం జిల్లాలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి

Jagan inaugurates three reservoirs in Anantapur Dist
  • ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లకు శంకుస్థాపన
  • పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటి తరలింపు
  • రూ. 800 కోట్లు విడుదల చేశామన్న జగన్
తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలోని మూడు రిజర్వాయర్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు, పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీటిని తరలించనున్నట్టు చెప్పారు. వర్చువల్ విధానం ద్వారా ఆయన ఈ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ పనులు మాత్రం చేయలేదని విమర్శించారు. ఈ పనుల వల్ల రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని చెప్పారు. వీటి ద్వారా 7 మండలాలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ప్రధాన కాల్వలు, రిజర్వాయర్లకు రూ. 800 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News