ఫోర్బ్స్ జాబితాలో పలువురు భారత మహిళలకు స్థానం!
- టాప్ 100 శక్తిమంతమైన వనితల జాబితా విడుదల
- తొలి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్
- నిర్మలా సీతారామన్, కిరణ్ మజుందార్, రోష్మీ నాడార్ లకు చోటు
ఇక ఇండియాకు చెందిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, టెక్ దిగ్గజం హెచ్సీఎల్ సీఈఓ రోష్నీ నాడార్ తదితరులకు స్థానం లభించింది. ఈ జాబితాలో అమెరికాకు కాబోయే వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూ స్థానం దక్కింది.
10 దేశాలకు చెందిన ఉన్నత పదవుల్లో ఉన్నవారు, 38 కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు, ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో ఉన్న ఐదుగురు మహిళలను ఫోర్స్బ్ తన జాబితాలో శక్తిమంతులుగా పేర్కొంది.