Nara Lokesh: ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం?: నారా లోకేశ్

Nara Lokesh shares a video of farmers who lost their crap due to heavy rains
  • నివర్ తుపానుతో ఏపీ రైతాంగానికి తీవ్ర నష్టం
  • రైతులు సర్వం కోల్పోయారన్న లోకేశ్
  • సాయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడి
  • రైతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యలు
  • జగన్ మనసు కరగడం లేదంటూ ట్వీట్
ఇటీవల తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఏపీ వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికందిన పంట నివర్ తుపాను పాలైంది. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. సర్వం కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. కౌలు రౌతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నా జగన్ మనసు కరగడంలేదని లోకేశ్ విమర్శించారు. ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం? అంటూ నిలదీశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి రైతులను ఆదుకోవాలని, వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ఓ వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు. తమ పంటలు వర్షానికి ఎలా దెబ్బతిన్నాయో రైతులు వివరించడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.
Nara Lokesh
Farmers
Jagan
YSRCP
Heavy Rains
Nivar
Andhra Pradesh

More Telugu News