Sharat Kumar: శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది: సినీ నటి రాధిక

Sharat Kumar tested positive for Coronavirus in Hyderabad
  • హైదరాబాదులో కరోనా సోకింది
  • అసింప్టొమేటిక్ లక్షణాలు వచ్చాయి
  • ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటా
ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య, సినీ నటి రాధిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

హైదరాబాదులో ఉన్న శరత్ కు కరోనా సోకింది. టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శరత్ కు అసింప్టొమేటిక్ లక్షణాలు వచ్చాయి. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను అందిస్తుంటానని రాధికా పేర్కొన్నారు. శరత్ కు కరోనా సోకిందనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Sharat Kumar
Corona Virus
Kollywood
Radhika

More Telugu News