Niharika Konidela: నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా ఉల్లాసం... ఫొటోలు ఇవిగో!

Niharika wedding celebrations in Udaypur
  • రేపు నిహారిక, చైతన్యల వివాహం
  • రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్
  • ఉదయ్ పూర్ లో కొలువుదీరిన మెగా కుటుంబాలు
  • సంగీత్ లో ఉత్సాహంగా పాల్గొన్న కాబోయే భార్యాభర్తలు
  • వైరల్ అవుతున్న ఫొటోలు
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక, గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యల వివాహం రేపు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో మెగా కుటుంబసభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పవన్ కల్యాణ్ తప్ప మెగా జనాలందరూ ఉదయ్ పూర్ లో కొలువుదీరారు.

సంగీత్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, శిరీష్ తదితరులు కాబోయే భార్యభర్తలు నిహారిక, చైతన్యలతో కలిసి ఆనందంగా డ్యాన్సులు చేశారు. అంతకుముందు నిర్వహించిన కోలాటంలోనూ చిన్నా పెద్దా తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట పోస్టు చేసిన కొద్దిసేపటికే వైరల్ అవుతున్నాయి.
Niharika Konidela
Chaitanya
Wedding
Udaypur
Ramcharan
Allu Arjun
Nischay

More Telugu News