Sai Pallavi: ప్రకాశ్‌ రాజ్‌ గాంభీర్యం అలా ఉండేది: హీరోయిన్ సాయిపల్లవి

 I am really scared about prakash raj character involvement sai pallavi
  • 'పావకదైగల్‌' సినిమాలో నటిస్తోన్న సాయిపల్లవి 
  • కథానాయికకు తండ్రిగా నటిస్తోన్న ప్రకాశ్ రాజ్
  • ఆయన  తీరు చూసి భయపడేదాన్నన్న సాయిపల్లవి  
తమిళ దర్శకులు గౌతమ్‌ మేనన్‌, వెట్రి మారన్‌, సుధ కొంగర, విఘ్నేశ్‌ శివన్‌ నలుగురూ కలసి నాలుగు కథలతో రూపొందిస్తోన్న 'పావకదైగల్‌' సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి ప్రధానపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నాడు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సెట్‌లో తండ్రి పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ తీరు చూసి భయపడేదాన్నని, ఆయన గాంభీర్యం అలా ఉండేదని చెప్పింది. ఆయన సెట్‌లో వున్నంతసేపూ తన పాత్రలోనే లీనమైపోయి ఉండేవాడని తెలిపింది.

సాయిపల్లవి వైద్య విద్యను పూర్తి చేసిన విషయం తెలిసిందే. దానిపై ఆమె స్పందిస్తూ... సినిమాల్లో నటించడం పూర్తయ్యాక తాను తప్పకుండా వైద్య వృత్తిపై దృష్టి పెడతానని, దాన్నే కొనసాగిస్తానని చెప్పింది. ఆ వృత్తిపై తనకెంతో గౌరవం ఉందని చెప్పింది. తనకు నాలెడ్జ్ అందించిన వ్యక్తుల్లో ‘ఫిదా’ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఒకరని, తనకు సూచనలు చేస్తుంటారని తెలిపింది.
Sai Pallavi
Prakash Raj
Tollywood

More Telugu News