WHO: రేపు ఏలూరు వస్తున్న డబ్ల్యూహెచ్ఓ బృందం....  వింతవ్యాధిపై అధ్యయనం

WHO comes to Eluru to study unidentified decease
  • 451కి పెరిగిన ఏలూరులో బాధితుల సంఖ్య
  • అంతర్జాతీయ స్థాయికి చేరిన ఏలూరు వింతవ్యాధి అంశం
  • అధ్యయనం చేయాలంటూ డబ్ల్యూహెచ్ఓను కోరిన ఏపీ సర్కారు
  • సమ్మతించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • రేపు ఏలూరుకు డబ్ల్యూహెచ్ఓ బృందం
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుబట్టని వింత వ్యాధి వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అర్థంకాని జబ్బుపై అధ్యయనం చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను కోరింది. దీనికి డబ్ల్యూహెచ్ఓ సమ్మతి తెలిపింది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి ఓ ప్రతినిధి బృందం రేపు ఏలూరు వస్తోంది. ఇప్పటికే ఏలూరు సమస్యకు కారణమేంటన్నది తేల్చేందుకు దేశీయ సంస్థలు సీసీఎంబీ, ఎన్ఐఎన్, ఐఐసీటీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

కాగా, ఏలూరులో బాధితుల సంఖ్య ఈ సాయంత్రానికి 451కి పెరిగింది. వారిలో 263 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొందరి పరిస్థితి విషమించడంతో వారిని విజయవాడ, గుంటూరు తరలించారు. అటు, డిశ్చార్జి అయిన వారిని నెల రోజుల పాటు పర్యవేక్షించాలని, వారికి పౌష్టికాహారం అందజేయాలని  సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
WHO
Eluru
Decease
Study
Andhra Pradesh
India

More Telugu News