Chiranjeevi: నిహారికను ఆశీర్వదించిన చిరంజీవి... నాగబాబు భావోద్వేగం!

Nagababu Emotional After Niharika Selfi with Chiru
  • నిహారికతో సెల్ఫీ దిగిన చిరంజీవి
  • చిరంజీవి ప్రేమకు అవధులుండవన్న నాగబాబు
  • వైరల్ అవుతున్న పిక్స్
మరో రెండు రోజుల్లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఉదయ్ పూర్ లోని ఓ స్టార్ హోటల్ లో జరగనున్న వేళ, ఈ ఉదయం నిహారిక ఫ్యామిలీ ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ కు బయలుదేరి వెళ్లింది. వారు బయలుదేరే ముందు చిరంజీవి నిహారికను ఆశీర్వదించారు. నిహారికతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన నాగబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

చిరంజీవి ప్రేమకు అవధులుండవని అన్నారు. చిరంజీవి నవ్వు ప్రతి సందర్భాన్నీ ఓ వేడుకగా మార్చుతుందని చెప్పారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆపై "ఓ కుటుంబంగా మేము నీకు అండగా ఉన్నాము. ఓ తండ్రిగా నేను నీకు రెక్కలను ఇచ్చాను. ఈ రెక్కలు నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయి. ఇదే సమయంలో నీ మూలాలు నిన్ను రక్షిస్తుంటాయి" అని మరో పోస్ట్ పెట్టి, నిహారికతో చిరు, నాగబాబు దంపతులు ఉన్న చిత్రాన్ని ఆయన పోస్ట్ చేశారు.
Chiranjeevi
Niharika
Wedding
Nagababu
Twitter

More Telugu News