Corona Virus: కరోనా వైరస్ వచ్చిన పురుషుల్లో దీర్ఘకాలిక సమస్య!

coronavirus may cause longterm erectile dysfunction in men
  • వైరస్ కారణంగా రక్తనాళ వ్యవస్థలో సమస్యలు
  • దీర్ఘకాలిక, జీవితకాల, సంభావ్య సమస్యలు తలెత్తే అవకాశం
  • నాడీ సమస్యలు సహా దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు

కరోనా వైరస్ నుంచి బయటపడినప్పటికీ దీర్ఘకాలంలో పలు సమస్యలు వేధించే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. తాజాగా నిపుణులు చెబుతున్న ఓ సరికొత్త విషయం షాక్‌కు గురిచేస్తోంది. వైరస్ సోకి కోలుకున్న తర్వాత పురుషుల్లో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డేనా గ్రేసన్ తెలిపారు. కాబట్టి టీకా వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వైరస్ సంక్రమించిన తర్వాత రక్తనాళ వ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఫలితంగా దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమేనన్నారు. నిజానికి వైరస్ మనుషుల్ని చంపేస్తుందనే అనుకుంటున్నారని, అయితే ఒకసారి వచ్చి తగ్గాక దీర్ఘకాలిక, జీవితకాల, సంభావ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని గ్రేసన్ వివరించారు. వైరస్ కారణంగా నాడీ సమస్యలు సహా దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు.

  • Loading...

More Telugu News