soyam bapurao: బీజేపీ ఎంపీ సోయం బాపురావు కనపడకుండా పోయారని పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్ ఫిర్యాదు

soyam missing congress gives complaint
  • లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారన్న కాంగ్రెస్
  • అమలు చేయకుండా తిరుగుతున్నారని వ్యాఖ్య
  • బాపురావు ఆచూకీని తెలపాలని ఫిర్యాదు
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రస్తుతం కనిపించకుండా పోయారంటూ పలువురు కాంగ్రెస్ నేతలు బాసర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హామీలను అమలు చేయకుండా కనపడకుండా తిరుగుతోన్న బాపురావు ఆచూకీని తమకు తెలపాలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన బాపురావు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్‌కు వచ్చి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
soyam bapurao
BJP
Congress

More Telugu News