Asaduddin Owaisi: టీఆర్ఎస్ నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు: ఒవైసీ

Didnt get any proposal from TRS says Owaisi
  • మేయర్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ
  • పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • బీజేపీ గెలుపు తాత్కాలికం మాత్రమే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. తనకు బాగా పట్టున్న ఓల్డ్ సిటీలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం, టీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం ఉందని ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ ఆరోపిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని కేటీఆర్ కొట్టిపారేశారు.

తాజాగా ఇదే అశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, గ్రేటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీఆర్ఎస్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. ఫలితాలను ఎన్నికల సంఘం పూర్తిగా ప్రకటించిన తర్వాత పార్టీలో చర్చించి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని ఒవైసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తాత్కాలికం మాత్రమేనని చెప్పారు.  
Asaduddin Owaisi
MIM
TRS
GHMC Elections

More Telugu News