Maradona: మ్యాచ్ మధ్యలో మారడోనాను తలచుకున్న లియోనల్ మెస్సీ... నిర్వాహకుల ఫైన్, ఫుట్ బాల్ అభిమానుల ఆగ్రహం!

Fine on Messi for Remembaring Maradona in Middle of the Match
  • స్పానిష్ లీగ్ లో భాగంగా మ్యాచ్
  • గోల్ కొట్టగానే తన పాత జెర్సీని ప్రదర్శించిన మెస్సీ
  • నిబంధనలకు విరుద్ధమంటూ జరిమానా
ఇటీవల కన్నుమూసిన దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు డిగో మారడోనాను మైదానంలో మ్యాచ్ ఆడుతూ స్మరించుకున్న ప్రస్తుత తరం స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీపై నిర్వాహకులు జరిమానా విధించారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న క్రీడాభిమానులు అంతటి మహా ప్లేయర్ ను మైదానంలో తలచుకుంటే తప్పేంటని మండిపడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే, స్పానిష్ లీగ్ లో భాగంగా ఇటీవల ఒసానుసాతో జరిగిన మ్యాచ్ లో బార్సిలోనా తరఫున మెస్సీ బరిలోకి దిగాడు.

ఆ సమయంలో తాను ధరించిన జెర్సీ కింద, గతంలో తాను మారడోనా అర్జెంటీనా లీగ్ టీమ్ నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ తరఫున ఆడిన వేళ ధరించిన జెర్సీని ముందే వేసుకుని వచ్చాడు. ఈ మ్యాచ్ లో మెస్సీ గోల్ చేసిన అనంతరం, తన జెర్సీని తొలగిస్తూ, లోపల ఉన్న నెవెల్స్ జెర్సీని ప్రదర్శిస్తూ, ఆకాశం వైపు చూస్తూ, చేతులు చాచి మారడోనాకు నివాళులు అర్పించాడు. అయితే, మెస్సీ చర్య నిబంధనలకు విరుద్ధమని తేల్చిన స్పానిష్ లీగ్ నిర్వాహకులు 600 యూరోల ఫైన్ వేశారు. మెస్సీకి క్రీడాభిమానుల నుంచి మాత్రం మద్దతు పుష్కలంగా లభిస్తోంది.
Maradona
Messi
Match
Fine

More Telugu News