GHMC Elections: గ్రేటర్ ఫైట్... పెన్నుతో టిక్ పెట్టినా ఓటేనన్న ఈసీ... హైకోర్టుకు బీజేపీ!

High Court to Hear EC Desission PenTick on Ballot
  • నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు
  • హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
  • మరికాసేపట్లో విచారించనున్న కోర్టు
నేడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, బ్యాలెట్ పేపర్ పై పెన్నుతో టిక్ పెట్టినా ఓటేసినట్టేనని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించలేదని ఆరోపిస్తూ, బీజేపీ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ ఉదయం హైకోర్టు తెరచుకోగానే దీనిపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈసీ తాజా నిర్ణయం తరువాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లపై తమకు అనుమానాలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.
GHMC Elections
Pen Tick
High Court
House Motion

More Telugu News