Pawan Kalyan: నేను సినిమాల్లోకి రాకముందు నుంచి రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై వింటూనే ఉన్నాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan comments on Rajinikanth political entry
  • రాజకీయ పార్టీపై రజనీకాంత్ స్పష్టత
  • స్పందించిన జనసేనాని
  • రజనీ విజయవంతం కావాలని పవన్ ఆకాంక్ష
తమిళ తలైవా రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నారన్న వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో దీనిపై వ్యాఖ్యానించారు. తాను సినిమాల్లోకి రాక ముందు నుంచి రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై చర్చ జరుగుతూనే ఉందని అన్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, పరోక్షంగా రాజకీయ పరిసరాల్లోనే ఉండేవారని, గతంలో డీఎంకేను గెలిపించాలని కోరడం తెలిసిందేనని వివరించారు.

అయితే, రజనీకాంత్ అనే కాకుండా, ఎవరైనా కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి ఒక బలమైన ఆలోచనతో వస్తున్నప్పుడు స్వాగతించాలని పవన్ తన వైఖరి వెల్లడించారు. రజనీకాంత్ కు ఎంతో బలమైన అభిమాన సమూహం ఉందని, ఆయన రాకతో మంచే జరుగుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో రజనీకాంత్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Pawan Kalyan
Rajinikanth
Political Entry
Party
Tamilnadu

More Telugu News