మహేశ్ సినిమా కోసం బ్యాంక్ సెట్ సిద్ధమవుతోంది!
- మహేశ్, కీర్తి జంటగా 'సర్కారు వారి పాట'
- బ్యాంకు స్కాముల నేపథ్యంలో సాగే కథ
- బ్యాంక్ సెట్లో నెల రోజుల షూటింగ్
- జనవరిలో అమెరికాలో మరో షెడ్యూలు
మొదట్లో ఈ నెలలో అమెరికాలో తొలి షెడ్యూలు షూటింగ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దానిని వాయిదా వేశారు. దాంతో తొలి షెడ్యూలును హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాదులో ఓ జాతీయ బ్యాంక్ సెట్ ను వేస్తున్నారు. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇందులో నెల రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ నిర్వహిస్తారు.
అనంతరం జనవరి నెలాఖరులో మరో షెడ్యూలు కోసం అమెరికా వెళతారు. బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అలాగే విదేశాలతో కూడా కథకు లింక్ ఉండడంతో యూఎస్ షూటింగును ప్లాన్ చేస్తున్నారు.