తమిళ ప్రజల తలరాతల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది: రజనీకాంత్
- రాజకీయ రంగప్రవేశంపై రజనీ స్పష్టత
- ఈ నెలాఖరున పార్టీ ప్రకటన
- డాక్టర్లు వద్దంటున్నా వస్తున్నానని వెల్లడి
- తమిళ ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని ఉద్ఘాటన
మారుస్తాం... అన్నింటినీ మారుస్తాం అంటూ తలైవా తన అభిమానుల్లో కొత్త ఉత్సాహం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ మార్పు రాదని ఉద్ఘాటించారు. తమిళ ప్రజల తలరాతల్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తున్నారని, కానీ తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేసేందుకైనా తాను సిద్ధమేనని, తమిళ ప్రజల కోసం సంతోషంగా ప్రాణాలు ఇచ్చేస్తానని పేర్కొన్నారు. వైద్యులు వద్దంటున్నా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పర్యటించాలని భావించినా, కరోనా వ్యాప్తి కారణంగా వీలుపడలేదని వివరించారు.