Corona Virus: దేశంలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు

 indias total cases rise to  9534965
  • 24 గంటల్లో 35,551 మందికి కరోనా 
  • మృతుల సంఖ్య 1,38,648
  • కోలుకున్న వారు 89,73,373 మంది
  • 4,22,943 యాక్టివ్ కేసులు
భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 35,551 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 526 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,38,648కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 89,73,373 మంది కోలుకున్నారు. 4,22,943 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,35,57,647 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,11,698 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News