england: టీ20ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఇంగ్లండ్.. మూడో స్థానంలో భారత్

england reaches 1st place in t20
  • దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ కైవసం
  • 275 రేటింగ్ పాయింట్లతో టాప్
  • రెండో స్థానంలో ఆస్ట్రేలియా  
టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచును గెలవడంతో ఇంగ్లండ్‌ 275 రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని ఈ జాబితాలో ప్రథమ స్థానంలో చేరింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా (275), మూడో స్థానంలో భారత్ (266), నాలుగో స్థానంలో పాకిస్థాన్‌ (262), ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా (252) ఉన్నాయి.

కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ మూడో టీ20లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ చేసి 191 పరుగులు చేయగా, ఆ లక్ష్యాన్ని ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది. ఇంగ్లండ్‌ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలోనే తమ లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ మలన్ 47 బంతుల్లో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జోస్‌ బట్లర్ 46 బంతుల్లో 67 పరుగులు సాధించాడు.
england
south africa
India
Team India
Cricket

More Telugu News