Shiv Sena: కాంగ్రెస్ ఆఫర్‌ను తిరస్కరించి శివసేనను ఎంచుకున్నా: నటి ఊర్మిళ 

Urmila matondkar says she rejected mlc offer by congress
  • గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన ఊర్మిళ
  • తాను పుట్టుకతోనే హిందువునన్న నటి
  • శివసేన అన్ని మతాలకు మంచి చేస్తుందని వ్యాఖ్య  
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన బాలీవుడ్ నటి, రంగీలా గాళ్ ఊర్మిళా మటోండ్కర్ నిన్న శివసేన పార్టీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై తనకు గౌరవం ఉందన్నారు.

 కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవి  ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ తాను శివసేనను ఎంచుకున్నట్టు చెప్పారు. తనకు ఓటమిని ఎదుర్కొనే ధైర్యం ఉందని పేర్కొన్నారు. తాను పుట్టుకతోనే హిందువునన్న ఆమె.. ఇతర మతాలను ద్వేషించమని తన మతం ఎప్పుడూ చెప్పలేదన్నారు. శివసేన హిందూత్వ పార్టీ అయినప్పటికీ అన్ని మతాలకు మంచి చేయాలని చూస్తోందని అన్నారు. కాగా, గత లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ముంబై నుంచి పోటీ చేసిన ఊర్మిళ బీజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో పరాజయం పాలయ్యారు.
Shiv Sena
Urmila matondkar
Bollywood
Congress
Maharashtra

More Telugu News