VK Singh: వీరిలో చాలా మంది రైతుల మాదిరి కనిపించడం లేదు: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

VK Singh sensational comments on farmers protests
  • ప్రతిపక్ష కార్యకర్తలు, రైతు కమిషన్ల సభ్యులే ఎక్కువగా ఉన్నారు
  • ఈ నిరసనలతో రైతులకు ఉపయోగం లేదు
  • వ్యవసాయ బిల్లులతో రైతులకు ఇబ్బంది లేదు
కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలపై కేంద్ర మంత్రి వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలా మంది తనకు రైతుల మాదిరి కనిపించడం లేదని అన్నారు. వారిలో ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, రైతు కమిషన్ల సభ్యులే ఉన్నారని అన్నారు.

 ఈ నిరసన కార్యక్రమాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. కొత్త వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. బయట వ్యక్తులే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలు, రైతు కమిషన్ల సభ్యులే ఈ తతంగాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారని అన్నారు. అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ, భారతీయ కిసాన్ యూనియన్ తో పాటు ఇతర రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు.
VK Singh
BJP
Farmers Protests

More Telugu News