Vishnu Kumar Raju: ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్పిన జగన్ చాలా గొప్ప వ్యక్తి: విష్ణుకుమార్ రాజు

Jagan talking about Corona in two different ways says Vishnu Kumar Raju
  • కరోనా తగ్గిందని కోవిడ్ కాంటాక్ట్ స్టాఫ్ నర్సులను ఇంటికి పంపిస్తారు
  • కరోనా ఉందని ఎన్నికలు పెట్టలేమంటారు
  • రాష్ట్ర మంత్రులు వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర మంత్రులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్పిన జగన్ చాలా గొప్ప వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కరోనా తగ్గిపోయిందని చెపుతూ కోవిడ్ కాంటాక్ట్ అయిన స్టాఫ్ నర్సులను ఇంటికి పంపిస్తారని... ఇదే సమయంలో కరోనా తీవ్రంగా ఉందని చెపుతూ అసెంబ్లీ సమావేశాల పని దినాలను తగ్గిస్తారని విమర్శించారు. కరోనా పేరు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలను పెట్టలేమంటున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్ర మంత్రులు వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంటోందని విష్ణు మండిపడ్డారు. వారు వాడుతున్న భాష వల్ల అందరూ తల దించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఎలాంటి భాష మాట్లాడాలనే విషయంలో మంత్రులకు జగన్ ఒక క్లాస్ పెట్టాలని, లేకపోతే ప్రత్యేక శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాలని సూచించారు.
Vishnu Kumar Raju
BJP
Jagan
YSRCP

More Telugu News