KTR: ఓటేయకుండా కంప్లయింట్లు చేసేవారందరూ ఆమెను చూసి నేర్చుకోవాలి: కేటీఆర్

KTR thanked a old age woman after she cast her vote
  • మందకొడిగా జీహెచ్ఎంసీ పోలింగ్
  • ఓటేసిన వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
  • పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న వృద్ధులు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ లో యువత ఎక్కువగా కనిపించకపోవడం పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఓ వృద్ధురాలు ఓటేసిన ఫొటోను ట్విట్టర్ లో చూసిన కేటీఆర్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. బయటికి వచ్చి ఓటేయకుండా కేవలం ఫిర్యాదులు చేసేవారు ఆమెను చూసి నేర్చుకోవాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. కాగా, నేటి జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వృద్ధులు అత్యధిక సంఖ్యలో ఓటేయడం కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు సందడి చేస్తున్నాయి.
KTR
Vote
Old Woman
GHMC Elections

More Telugu News