Australia: భారత్‌తో రెండో వన్డే: 22 ఓవర్లు దాటినా ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆస్ట్రేలియా

australia score 136 for 22 overs
  • రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆసీస్
  • ఆరోన్ ఫించ్, వార్నర్ హాఫ్ సెంచరీలు
  • 22 ఓవర్లకు ఆస్ట్రేలియా 136 పరుగులు  
ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఇటీవల జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రోజు రెండో వన్డేలోనైనా రాణించాలని కసిగా ఆడుతోన్న భారత బౌలర్లు 22 ఓవర్లు దాటినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. రెండో వ‌న్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్ 60 బంతులకు ఒక సిక్స్, ఐదు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. డేవిడ్ వార్నర్ కూడా హాఫ్ సెంచరీ చేసి ధాటిగా అడుతున్నాడు.  22 ఓవర్లకు ఆస్ట్రేలియా 136 పరుగులు చేసింది. క్రీజులో ఫించ్ 54, డేవిడ్ వార్నర్ 78 పరుగులతో ఉన్నారు. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
Australia
India
Cricket

More Telugu News