butta bomma: నిన్నటి సిడ్నీ మ్యాచ్‌లో మైదానంలోనే ‘బుట్టబొమ్మ’ పాటకు డేవిడ్ వార్నర్ డ్యాన్స్.. వీడియో వైరల్

david warner dances again for butta bomma song
  • ఇప్పటికే పలు సార్లు బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ 
  • మరోసారి చేస్తానని ఇటీవలే చెప్పిన వార్నర్
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డేవిడ్
  • అల్లు అర్జున్, పూజ హెగ్డే అభిమానులు ఖుషీ
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ పలు సార్లు డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. గతంలో తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఐపీఎల్ సందర్భంగానూ బుట్టబొమ్మ స్టెప్ వేసి అలరించాడు.

ఆ సందర్భంగా ఆయన అభిమానులకు ఓ హామీ ఇచ్చాడు. మరోసారి కూడా బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తానని చెప్పాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో నిన్న జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌పై కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన మాటలను నిలబెట్టుకున్నాడు డేవిడ్ వార్నర్.

మైదానంలో ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలోనే ఆయన  ‘బుట్టబొమ్మ’ స్టెప్ వేయడం గమనార్హం. దీంతో ఆయన డ్యాన్స్ చూసిన వారంతా ఆనందంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ చేశారు. ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.  అల్లు అర్జున్, పూజా హెగ్డేల 'బుట్టబొమ్మ' సాంగ్ యూట్యూబ్‌లో 450 మిలియన్ల వ్యూస్ దాటేసి రికార్డు సాధించిన విషయం తెలిసిందే.
butta bomma
David Warner
Australia
India
Cricket

More Telugu News