Manchu Lakshmi: కొత్త ఆరంభం కోసం... కొత్త ఆఫీసులో...: మంచు లక్ష్మి ఆసక్తికర పోస్టు

Manchu Lakshmi says she has been entered into a new venture
  • కూతురితో కలిసి కొత్త ఆఫీసులో అడుగుపెట్టిన మంచు లక్ష్మి
  • ఆశీస్సులు అందించాలంటూ ట్వీట్
  • ఇప్పటికే కుమార్తెతో కలిసి యూట్యూబ్ లో సందడి
టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఆసక్తికర అప్ డేట్ పంచుకున్నారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నానని వెల్లడించారు. త్వరలోనే ప్రేక్షకులకు అందమైన కథలు చెప్పబోతున్నానని తెలిపారు. తన కుమార్తెతో కలిసి ఇవాళ కొత్త ఆఫీసులో ప్రవేశించానని, ఈ కొత్త పని పట్ల ఎంతో ఉద్విగ్నతకు గురవుతున్నానని వివరించారు. ఎన్నో మంచిపనులకు ఇది వేదిక అవుతుందని అనుకుంటున్నానని, అపారమైన అదృష్టం కలగాలని తనకు ఆశీస్సులు అందించాలని అభిమానులను కోరారు.

కాగా, మంచు లక్ష్మి ఇకపై వెబ్ సిరీస్ లు, టాక్ షోలు చేయనుందని టాక్ వినిపిస్తోంది. అందుకోసమే సరికొత్త ఆఫీసు ప్రారంభించినట్టు అర్థమవుతోంది. ఇప్పటికే ఆమె తన కుమార్తెతో కలిసి యూట్యూబ్ లోనూ సందడి చేస్తోంది.
Manchu Lakshmi
Office
Daughter
Tollywood

More Telugu News