Richa Gangopadhyay: సినిమాలు వదిలేసి అమెరికాకు వెళ్లిపోవడానికి కారణం ఇదే: రిచా గంగోపాధ్యాయ

Richa Gangopadhyay reveals the reason for leaving cinemas
  • మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలనేది నా కల
  • ఎంబీఏ అవకాశం రావడంతో అమెరికాకు వెళ్లిపోయా
  • నా క్లాస్ మేట్ నే ప్రేమపెళ్లి చేసుకున్నా
రిచా గంగోపాధ్యాయ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో 'మిర్చి', 'లీడర్' వంటి హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందంతో పాటు అభినయం కూడా కలబోసిన రిచా తెలుగులో బిజీ ఆర్టిస్టుగా కొనసాగింది. కెరీర్ చక్కగా కొనసాగుతున్న సమయంలోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి... ఆమె అమెరికాకు వెళ్లిపోయింది. అమెరికా జాతీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. సినీ కెరీర్ ను హఠాత్తుగా ఆపేయడంపై తాజాగా ఆమె స్పందించింది.

తనకు చదువంటే ఇష్టమని... మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలనేది తన చిన్ననాటి కల అని రిచా తెలిపింది. ఎంబీఏ చదివే అవకాశం రావడంతో అమెరికాకు వెళ్లిపోయానని చెప్పింది. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించిందని తెలిపింది. ఎంబీఏలో తన క్లాస్ మేట్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పింది. సినిమాలకు దూరమయ్యాననే బాధ తనలో లేదని... తన జీవితం ప్రస్తుతం సాఫీగా సాగుతోందని తెలిపింది.
Richa Gangopadhyay
Tollywood
Marriage
Love

More Telugu News