Health Insurence: ఈ ఘనత మహానేత వైఎస్ఆర్, జగన్ లదే: విజయసాయి రెడ్డి

AP Number One in Health Insurence says Vijaya Sai
  • దేశంలో ఆరోగ్య బీమాలో ఏపీ నంబర్ వన్
  • గ్రామాల్లో 76.1 శాతం మందికి అందుతోంది
  • దేశ సగటు 12.9 శాతం మాత్రమేనన్న విజయసాయి
దేశంలో ఆరోగ్య బీమాను ప్రజలందరికీ దగ్గర చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నిలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరోగ్య బీమా అమలు విషయంలో ఏపీ తొలి స్థానంలో ఉందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "దేశంలోనే అరోగ్య బీమా పొందుతున్నవారిలో ఏపీ నంబర్ 1. ప్రభుత్వ బీమా పొందుతున్నవారు దేశ సగటు గ్రామాల్లో 12.9, పట్టణాల్లో 8.9 శాతం. ఏపీలో గ్రామాల్లో 76.1%, పట్టణాల్లో 55.9%. ఈ ఘనత ఆ మహానేత వైఎస్ఆర్ మరియు వైఎస్ జగన్ గారిదే" అని వ్యాఖ్యానించారు.
Health Insurence
Vijayasai Reddy
Twitter
Jagan

More Telugu News