Anjani Kumar: హైదరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి: సీపీ అంజనీ కుమార్ వీడియో!

CP Anjani Kumar Video Message
  • శాంతిని భగ్నం చేసేందుకు దుష్టుల కుట్ర
  • సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీపీ
హైదరాబాద్ లో శాంతి సామరస్యాలను భంగ పరిచే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఉదయం ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై పీడీ యాక్ట్ పెడతామన్న ఆయన, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఎన్నికల వేళ, సామాజిక మాధ్యమాల్లో అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయని, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

"హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎన్నికల క్రమంలో ఉంది. ప్రజల మనసులను గెలుచుకుని ఓట్లు పొందాలని అందరు నేతలూ ఎంతో శ్రమిస్తున్నారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేవాలయం వంటిది. ఈ సమయంలో కొందరు దుష్టులు ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. వారిని మీరు నమ్మవద్దు. ఏ విషయం మీ దృష్టికి వచ్చినా మాకు తెలియజేయండి" అన్నారు. అంజనీ కుమార్ వీడియోను మీరూ చూడవచ్చు.
Anjani Kumar
CP
Twitter
Waringn

More Telugu News