టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీదేవికి చేదు అనుభవం

  • జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీదేవి
  • కుషాయిగూడలో పర్యటన
  • వరద సాయంపై నిలదీసిన మహిళలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్న పలువురు నేతలు, అభ్యర్థులకు తరుచూ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాము కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోని వారు ఓట్ల కోసం మాత్రం తమ వీధుల్లోకి వస్తున్నారంటూ నేతలు, అభ్యర్థులపై కొన్ని ప్రాంతాల వారు మండిపడుతూ, వారిని ముఖం మీదే అడిగేస్తూ తిప్పిపంపుతున్నారు.

తమ కాలనీల్లో మౌలిక వసతులు లేవని, ఎన్నో హామీలు ఇచ్చి వెళ్తున్నారని అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారు. దీంతో ప్రజలకు నేతలు నచ్చచెప్పలేకపోతున్నారు. ఈ రోజు మరో అభ్యర్థికి స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ అభ్యర్థి బొంతు శ్రీదేవి జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నారు.

ఈ రోజు కుషాయిగూడలో పర్యటిస్తూ తమకు ఓట్లు వేయాలని వేడుకున్నారు. అయితే, కుషాయిగూడలో వరద సాయంపై ఆమెను స్థానిక మహిళలు గట్టిగా నిలదీశారు. దీంతో అందరికీ వరద సాయం అందేలా చూస్తామని చెప్పి అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.
Go Back to Shorts
Sridevi
TRS
GHMC Elections

More Telugu News