Tirumala: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు!

Nearly 2 Crore Hundi Offerings in Tirumala
  • స్వామి దర్శనానికి జీవీఎల్,సునీల్ దేవధర్, వేమిరెడ్డి
  • నిన్న రూ. 1.95 కోట్ల హుండీ ఆదాయం
  • రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆంక్షలు
మంగళవారం నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని 29,298 మంది భక్తులు దర్శించుకోగా, 1.95 కోట్ల ఆదాయం హుండీ ద్వారా లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వచ్చిన వారిలో 10,129 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న రాష్ట్రపతి తిరుమలకు రావడంతో, పలు ఆంక్షలను అధికారులు అమలు చేయగా, భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గిందని తెలుస్తోంది.

 రాష్ట్రపతి వెళ్లిన తరువాత పలువురు బీజేపీ, వైసీపీ నేతలు స్వామిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. బుధవారం నాడు కనీసం 30 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Tirumala
Tirupati
GVL Narasimha Rao
TTD

More Telugu News