అత్యాచారానికి పాల్పడితే రసాయనాలతో నపుంసకుడిలా మార్చేస్తారట... పాక్ లో కొత్త చట్టం!
- కఠిన చట్టానికి రూపకల్పన
- కేబినెట్ ముందుకు ముసాయిదా
- ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
- ప్రధాని సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు ప్రచారం
ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్ లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు.