Andhra Pradesh: ఏపీ నుంచి చెన్నైకి ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభం

APSRTC set to run bus services to Chennai
  • 8 నెలల తర్వాత చెన్నైకి బస్సులు
  • ఆన్ లైన్ లోనూ టికెట్లు
  • డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని బస్సులు
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం ఎప్పుడో పచ్చజెండా ఊపినా ఏపీలో మాత్రం ఇప్పుడిప్పుడే బస్సులు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నాయి. కొన్నిరోజుల కిందట తెలంగాణకు బస్సులు పునఃప్రారంభించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రేపటి నుంచి చెన్నైకి కూడా బస్సులు తిప్పేందుకు సన్నద్ధమైంది.

విజయవాడతో పాటు తిరుపతి, గూడూరు తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. చెన్నైకి ఏపీ నుంచి మళ్లీ బస్సులు తిరగడం 8 నెలల తర్వాత ఇదే ప్రథమం. చెన్నై ప్రయాణం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ లోనూ టికెట్లు ఉంచింది. రాబోయే రోజుల్లో డిమాండ్ కు అనుగుణంగా చెన్నైకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు.
Andhra Pradesh
Chennai
Bus Services
Inter State
Corona Virus
Lockdown

More Telugu News