Joe Biden: తన క్యాబినెట్ ను ప్రకటించిన జో బైడెన్!

Biden Announcees his Cabinet
  • విదేశాంగ మంత్రిగా ఆంటోనీ బ్లింకెన్
  • జాన్ కెర్రీ వాతావరణ విభాగానికి అధిపతి
  • హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి మాయోర్కస్
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్, సోమవారం నాడు పలువురిని తన క్యాబినెట్ సహచరులుగా ఎంచుకున్నారు. తనకు సుదీర్ఘకాలంగా విదేశీ విధాన సలహాదారుగా ఉన్న ఆంటోనీ బ్లింకెన్ ను విదేశాంగ శాఖ మంత్రిగా నియమించుకున్నారు. యూఎస్ మాజీ చీఫ్ డిప్లొమాట్ జాన్ కెర్రీని ప్రత్యేక వాతావరణ విభాగానికి అధిపతిని చేశారు. క్యూబాలో జన్మించి, బైడెన్ కు ఎంతోకాలంగా న్యాయ సేవలను అందిస్తున్న అలెజాండ్రో మాయోర్కస్ ను ఇమిగ్రేషన్ సేవలను నిర్వహించే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మంత్రిని చేశారు.

సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్విల్ హైన్స్ ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ పదవికి అమెరికా చరిత్రలో ఓ మహిళను ఎంచుకోవడం ఇదే తొలిసారి. ఇక యునైటెడ్ నేషన్స్ లో అమెరికా ప్రతినిధిగా లిండా థామస్- గ్రీన్ ఫీల్డ్ ను నియమించారు. బైడెన్ అమెరికాకు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సేవలను అందించిన జాక్ సుల్లివాన్ ను వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ గా నియమించారు.

కాగా, వీరంతా 2009 నుంచి 2017 మధ్య ఒబామా - బైడెన్ పాలన జరుగుతున్న కాలంలో వారి వారి రంగాల్లో అపారమైన అనుభవాన్ని కలిగున్న సీనియర్లు కావడం గమనార్హం.
Joe Biden
Cabinet
Antoney Blinken

More Telugu News