India: 'డిసెంబర్ 1 తరువాత రైళ్లు బంద్' అంటూ వైరల్ పోస్ట్.. అవాస్తవమన్న పీఐబీ!

Fake Post on Trains in India
  • గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న పోస్ట్
  • రైల్వే శాఖ నుంచి ఎటువంటి ప్రకటన లేదన్న పీఐబి     
  • అటువంటి మెసేజ్ లను నమ్మద్దని స్పష్టీకరణ
డిసెంబర్ 1వ తేదీ నుంచి కొవిడ్ ప్రత్యేక రైళ్లు సహా అన్ని రైళ్ల సేవలూ నిలిచిపోతాయని గడచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పోస్ట్ అవాస్తవమని పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వెల్లడించింది. రైళ్ల నిలిపివేతపై రైల్వే శాఖ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదని స్పష్టం చేసింది. ఈ పోస్ట్ లో వాస్తవం లేదని, రైళ్లు కొనసాగుతాయని తెలియజేసింది. ఇటువంటి అనుమానాస్పద మెసేజ్ లను చూస్తే, వెంటనే నమ్మవద్దని సూచించింది. 'పీఐబీ డాట్ గవ్ డాట్ ఇన్' లేదా 'ఫ్యాక్ట్ చెక్ డాట్ పీఐబీ డాట్ గవ్ డాట్ ఇన్' వెబ్ సైట్లకు పంపించి వాస్తవాన్ని తెలుసుకోవచ్చని పేర్కొంది.


India
Trains
Fact Check
December 1

More Telugu News