New Delhi: నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన పవన్.. నేడు బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ

pawan kalyan went to delhi will meet bjp chief nadda today
  • ఏపీ, తెలంగాణ  తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
  • ఏపీ స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం  
  • విజయశాంతిని కలిసే అవకాశం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ ఉదయం వీరు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలతోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతోపాటు ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి నేడు బీజేపీలో చేరనున్నారు. పవన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, విజయశాంతి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
New Delhi
Andhra Pradesh
Pawan Kalyan
Vijayashanti
BJP

More Telugu News