తమిళ హాస్యనటుడు తవసి కన్నుమూత
- క్యాన్సర్ తో బాధపడుతున్న తవసి
- మధురై ఆసుపత్రిలో చికిత్స
- సాయం కోసం వేడుకున్న వైనం
- చికిత్స పొందుతూ మృతి
ఒకప్పుడు ఎంతో పుష్టిగా ఉన్న తవసి ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో అత్యంత దయనీయంగా చిక్కిశల్యమైన స్థితిలో కనిపించారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆయనను చూసి అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో దాతలు స్పందించే లోపే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన మృతికి తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.