Daughter: తల్లి మృతదేహాన్ని ఆర్నెల్లుగా ఇంట్లోనే ఉంచుకున్న కుమార్తె

Daughter lives with her mother dead body in Mumbai
  • ముంబయిలో ఘటన
  • మార్చిలో మరణించిన తల్లి
  • ఇంటి నుంచి వెలుపలికి రాని కుమార్తె
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
ఇదో విషాద ఉదంతం. అనారోగ్యంతో తల్లి మరణించినా, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఆర్నెల్ల పాటు మృతదేహంతోనే గడిపిందో మహిళ. తల్లి వయసు 83 సంవత్సరాలు కాగా, కుమార్తె వయసు 53 ఏళ్లు. వీరిద్దరూ ముంబయిలోని బాంద్రాలో నివసిస్తుంటారు. అయితే తల్లి గత మార్చిలో చనిపోయింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న కుమార్తె ఈ విషయాన్ని గుర్తించిందో లేదో తెలియదు కానీ, విగతజీవిగా పడివున్న తల్లితోనే జీవనం కొనసాగించింది.

కాగా, ఆమె తన మలమూత్రాలను, ఇంట్లోని చెత్తను కిటికీ ద్వారా బయట పడేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగప్రవేశం చేసి చూడగా, తల్లి మరణించిన విషయం వెల్లడైంది. తల్లి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుమార్తెను మానసిక చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేర్చారు.

గతంలోనూ వీరి ఇంట్లో ఓ కుక్క చనిపోగా, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ మూగజీవి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నట్టు స్థానికులు తెలిపారు. తాజాగా వృద్ధురాలు మరణించిన విషయం తెలియడంతో ఆమె కుమార్తె పరిస్థితి పట్ల వారు చలించిపోయారు.
Daughter
Mother
Dead Body
Mumbai
Police

More Telugu News