Tollywood: తెలుగు సినీ పరిశ్రమకు ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు!

Telangana government announces relief measures to corona hit Tollywood
  • రూ.10 కోట్ల లోపు నిర్మించే చిత్రాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్
  • థియేటర్లలో షోలు పెంచుకునే అవకాశం
  • థియేటర్ల హెచ్ టీ, ఎల్టీ కనెక్షన్ల కనీస డిమాండ్ చార్జీలు రద్దు
కొన్నిరోజుల కిందట చిరంజీవి, నాగార్జున తదితర సినీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి టాలీవుడ్ ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. కరోనా కారణంగా దెబ్బతిన్న తెలుగు చిత్ర పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. రూ.10 కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల యాజమాన్యాలు షోలు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చారు. అంతేకాకుండా, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న విధంగా సినిమా టికెట్ రేట్లు సవరించుకునేందుకు అనుమతినిస్తున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా, జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లకు ఇతర వ్యాపార సంస్థల తరహాలో ఉండే హెచ్ టీ, ఎల్టీ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కనీస డిమాండ్ చార్జీలను రద్దు చేశారు. కరోనాతో కుదేలైన మరో రంగం చిత్ర రంగం అని, చిత్రనిర్మాణానికి పెట్టింది పేరైన మన సినీ పరిశ్రమ పునరుద్ధరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
Tollywood
Telangana
KCR
Corona Virus

More Telugu News