Uttar Pradesh: కూతురిని ప్రేమించాడని... రాత్రంతా చావగొట్టారు, తెల్లారి పెళ్లి చేశారు!

Lover Beten by Ladys Family and their Marriage in Next Morning
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ప్రియురాలిని కలిసేందుకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు
  • పోలీసు స్టేషన్ లో జరిగిన పంచాయతీ
  • మరుసటి రోజే ఇద్దరికీ పెళ్లి
తమ కుమార్తెను ప్రేమించాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిని బంధించి, అతనిని రాత్రంతా కొట్టిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు, తెల్లారగానే ఇద్దరికీ వివాహం జరిపించిన వింతైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లో జరిగింది.

ఈ ఘటన వివరాలలోకి వెళితే... అజిమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుమలి నగర్ కు చెందిన ఓ యువకుడు, తన ప్రియురాలిని కలిసేందుకు అర్ధరాత్రి పూట ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రియురాలి కుటుంబీకులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని ఓ గదిలో బంధించిన యువతి బంధువులు, అతన్ని చితక్కొట్టారు. ఆపై తెల్లారగానే పోలీసులకు అప్పగించారు.

ఈ విషయంలో అబ్బాయి, అమ్మాయి తరఫు వారంతా ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసును విచారించారు. ఆపై జరిగిన పంచాయతీలో కేసులు వద్దని, ఇద్దరికీ వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించుకోగా, వెంటనే ఇద్దరికీ వివాహం జరిగిపోయింది. తనకు తగిలిన గాయాలతోనే ప్రియుడు, తనకు నచ్చిన ప్రియురాలి మెడలో తాళి కట్టేసి, ఆ బాధను మర్చిపోయాడు.  
Uttar Pradesh
Marriage
Lover
Police

More Telugu News