Congress: కాంగ్రెస్ కు భారీ షాక్... రేపే రాములమ్మ బీజేపీలోకి!

Vijayashanti to Join BJP Tomorrow
  • మంగళవారం జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా
  • ఆపై కేంద్ర నేతలతో సమావేశాలు
  • హైదరాబాద్ రాగానే బీజేపీకి ప్రచారం
కాంగ్రెస్ పార్టీకి భారీ షాకిస్తూ ప్రముఖ నటి, పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి, రేపు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆపై ఢిల్లీలో పార్టీ కేంద్ర నేతలతో ఆమె భేటీ అవుతారు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన బీజేపీ వర్గాలు, ఢిల్లీ నుంచి రాగానే, ఆమె జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ విస్తృతంగా ప్రచారం చేయనున్నారని తెలిపారు.

కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న రాములమ్మ, దుబ్బాక ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆపై తన అనుచరులతో సమావేశమైన విజయశాంతి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. విజయశాంతికి బీజేపీలో కీలకమైన బాధ్యతలనే అప్పగిస్తారని సమాచారం.
Congress
BJP
Vijayashanti

More Telugu News