Chandrababu: ప్రకాశం జిల్లాలో వైసీపీ రౌడీలు కత్తులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: చంద్రబాబు

Chandrababu terms YCP ruling as barbarous
  • అటవిక పాలన అంటూ వైసీపీపై ఆగ్రహం
  • దౌర్జన్యం, దాడులు తప్ప జగన్ చేసిందేమీ లేదని వ్యాఖ్యలు
  • పిరికిపంద చర్యలంటూ ట్విట్టర్ లో స్పందన
వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైసీపీ పాలన అటవిక రాజ్యాన్ని తలపిస్తోందని విమర్శించారు. దౌర్జన్యం, దాడులు తప్ప వైఎస్ జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందూరు ఎంపీటీసీ అభ్యర్థి రాఘవమ్మ భర్త కృష్ణయ్య యాదవ్ తో పాటు వీరాస్వామి అనే వ్యక్తిపైనా వైసీపీ రౌడీలు కత్తులతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వైఖరి అవలంబిస్తే ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డికి త్వరలోనే బాధిత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
Chandrababu
YSRCP
Jagan
Telugudesam
Andhra Pradesh

More Telugu News